ఎల్లారెడ్డిపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అక్షర విజేత,వెంకటాపూర్ (రామప్ప):-
వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తుల, రైతుల సౌకర్యం గ్రామంలోని భద్రకాళి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు కొలనుపాక పద్మ, సెంటర్ ఇంచార్జ్ గండ్రకోట సుమలత ల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం ధర్మ, సీసీ బీమా నాయక్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా నేరుగా గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించి లబ్ధి పొందాలని అన్నారు. కోసిన ధాన్యాన్ని తేమశాతం ఎక్కువ లేకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంటర్ ఇంచార్జ్ సుమలత తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు ఆదేశించారు. అదేవిధంగా వీ ఓ అధ్యక్షురాలు పద్మ, సెంటర్ ఇంచార్జ్ సుమలత మాట్లాడుతూ... ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహన కొనసాగుతుందని అన్నారు. రైతులు పంట పొలాన్ని కోసిన వెంటనే ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం లేకుండా చేసిన అనంతరమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు మాత్రమే ప్రభుత్వ మద్దతు ధర వర్తిస్తుందని సూచించారు. ఎల్లారెడ్డిపల్లి రైతులు అవకాశాన్ని సభ్యులను చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, సెంటర్ నిర్వాహకులు కొలనుపాక సంధ్యారాణి, ఎర్ర వేణి స్వరూప, గ్రామస్తులు బేతి సతీష్ యాదవ్, కొంపెల్లి దేవేందర్ రెడ్డి, బైకని చిన్న రాజయ్య, బోయిని సుధాకర్, వీరబోయిన సాంబయ్య, గువ్వ వీరస్వామి, వీరబోయిన మధుకర్, మర్రి సాంబయ్య, సోమిడి మొగిలి, బండి శ్రీనివాస్, మెంతుల దేవేందర్, హమాలీలు,రైతులు, గ్రామస్తులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.