దెబ్బతిన్న నాగపూర్ రోడ్డుకు మరమ్మత్తులు చేయించిన ఇందిరమ్మ కమిటీ మెంబర్, కాంగ్రెస్ నాయకులు దొడ్డి చెన్నకేశవులు ==వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంత
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని నాగపూర్ నుండి రేవల్లి మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు భారీ వరదలకు రోడ్డు అంతా పలుచోట్ల గుంతలు పడి దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో నాగపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవులు అలాగే వారి టీం తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో ఉమ్మడి గోపాల్పేట్ మండలాల ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి అలాగే రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు చొరవతో తక్షణమే గుణాలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉందో అక్కడ అమర్చి రోడ్డును యధావిధిగా తాత్కాలిక మరమ్మత్తులు చేయించడం జరిగింది అదేవిధంగా పంట పొలాలకు వెళ్లే లోడే పర్వతాలు పొలం దగ్గర ఉన్న రహదారికి అలాగే రోడ్లకు గుణలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు