*వందేమాతరం గీతానికి 150 ఏళ్లు: చిలకలూరిపేటలో ఘనంగా వేడుకలు ర్యాలీ, సామూహిక గీతాలాపన*
చిలకలూరిపేట అక్షర విజేత
చిలకలూరిపేట మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మరియు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత జాతీయ గీతం 'వందేమాతరం' రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో ఈ చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా టౌన్ ప్రెసిడెంట్ సమద్ ఖాన్ పట్టణ కార్యదర్శి మద్దిమల రవి,
మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, విద్యార్థులు, మున్సిపల్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశభక్తిని చాటుతూ పట్టణ పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో పట్టణం మారుమోగింది ర్యాలీ అనంతరం పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు.వందేమాతరం గీతం యొక్క గొప్పదనం, చరిత్ర మరియు స్వాతంత్ర్య పోరాటంలో దాని పాత్రపై కౌన్సిలర్లు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పి శివకుమారి, కే ప్రమీల, కంచర్ల కరుణ,బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, జంగ సుజాత, షేక్ నసీమా బేగం, బిట్రా రాజేంద్ర,టీడీపీ మహిళ నాయకురాలు నేతలు, నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర పాల్గొన్నవారంతా ముక్తకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ వేడుకల్లో టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.