*ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వెంకయ్య కి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు*
అప్పాపురం అక్షర విజేత
మంచి మనిషి.... అందరినీ ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చిలకలూరిపేట నియోజకవర్గం లో మొదటి నుండి ఎమ్మార్పీఎస్ ఉద్యమం లో తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఉద్యమానికి అండ దండలుగా నిలిచిన అప్పాపురం గ్రామానికి చెందిన కారసాల వెంకయ్య అన్న అకాల మరణానికి చింతిస్తూ అన్న భౌతిక కాయానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.... నివాళులర్పించిన వారిలో ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు అద్దంకి బాబు మాదిగ, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కోట చంటి మాదిగ, మందా శివ మాదిగ, బొంతా అశోక్ మాదిగ, కొండేపాగ క్రాంతి కుమార్ మాదిగ, బొజ్జ జాషువా మాదిగ, మ్యాక్స్ నైన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ బొంతా భగత్ సింగ్ తదితరులు ఉన్నారు