పలు సమస్యలపై ఆదివాసుల సమావేశం.
అక్షర విజేత, అదిలాబాద్ జిల్లా బ్యూరో.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ఆదివాసి భవనంలో శనివారం రోజున అనగా తేదీ 8/11/2025 సమయము సుమారు మధ్యాహ్నం 12 గంటలకు ఆదివాసుల పలు సమస్యలపై , సమావేశం నిర్వహించబడును, కావున ప్రతి ఆదివాసి గ్రామం నుంచి పటేల్లు, దేవరీలు, మహాజన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, విద్యార్థి సంఘ సభ్యులు, తుడుం దెబ్బ ప్రతినిధులు, రాజ్ గోండ్ సేవా సమితి, ఆదివాసీ సేన వంటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు.
ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని సంఘాల పెద్దలు, నాయకులు సమన్వయం చేస్తున్నారు.
లఖంపూర్ రాయి సెంటర్ సార్మేడి,ఆత్రం గంగారాం తెలిపారు.