బిచ్కుందలో పలు హాస్టలలో తనిఖీలు..
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సివిల్ సప్లై ఎన్ఫోర్మెంట్స్ అధికారులు శుక్రవారం పలు హాస్టల్లలో తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్, బిసి బాల బాలికల, ఎస్సీ బాల బాలికల హాస్టల్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు సరిగా అందించాలని పేర్కొన్నారు. మెనూ ప్రకారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించాలని వార్డెన్లకు తెలియజేశారు. హాస్టల్లలో వంటగది, మరుగుదొడ్లు, విద్యార్థులు పడుకునే గదులు శుభ్రంగా ఉంచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. విద్యార్థులకు ఏ విధమైన సమస్యలు రాకుండా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ డి ఎం.శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఓ సుదర్శన్ రెడ్డి, టాస్క్స్పోర్ట్స్ ఎస్సై శ్రీనివాసరావు, డీటీలు సురేష్ ఖలిద్, వార్డెన్ సంధ్య తదితరులు పాల్గొన్నారు