*ఎడ్లపాడు పరిధిలో ఆన్లైన్ వ్యభిచారం.... మహిళ అరెస్ట్.*
ఎడ్లపాడు అక్షర విజేత
చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు నేతృత్వంలో పోలీసులు ఈరోజు ఉదయం ఎడ్లపాడు పరిధిలో ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు.పసుమర్రు గ్రామంలో అద్దె ఇంటిలో ఈ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో వ్యభిచారం,కోడి పందాలు, కోతముక్కలు వంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్య కలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.