*మాదక ద్రవ్యాల వినియోగం - మానవ మనుగడకు హానికరం.* *మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మనమందరం నడుం బిగిద్దాం* -
పల్నాడు జిల్లా అక్షర విజేత
పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా విద్యార్ధినీ,విద్యార్థులకు మాదకద్రవ్యాలు రవాణా, వినియోగం వలన జరిగేటువంటి అనర్ధాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
యువతలో డ్రగ్స్ వంటి వ్యసనాల నుండి సమాజాన్ని కాపాడటమే ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు.
*పోలీసు అధికారులు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ* ....
మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం, దేశం మొత్తానికి హానికరం అని,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి లోనుకాకుండా నివారుంచుటకు ఈ ఏ జి ఎల్ ఈ వ్యవస్థను స్థాపించింది.
ఈ అవగాహన కార్యక్రమంలో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి వారి సేవలను పోలీసు శాఖ వినియోగించుకొననున్నట్లు తెలిపారు.
పాఠశాలలలో, కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండాలని సూచించారు.
ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని,వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారని, వారు మాదకద్రవ్యాలు,మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి తమ వ్యసనాలను తీర్చుకోవడానికి నేర పవృత్తి వైపు మళ్ళి నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని, కావున తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు అట్టి వారి పై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం రవాణా వలన చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.
యువతలో క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు.
విద్యార్ధినీ విద్యార్థులకు వారి పరిసరాలలో గంజాయి, మాదక ద్రవ్యాలను ఎవరైనా వినియోగించిన లేదా విక్రయించిన సదరు సమాచారాన్ని దగ్గరలోని పోలీస్ వారికి గాని, 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని తెలిపారు.
ఎన్ డి పి ఎస్ చట్టం అనేది కఠినమైన చట్టం.గంజాయి అమ్మిన, కొనిన, సరఫరా చేసిన, సేవించిన, పండించిన వారికి ఎన్ డి పి ఎస్ చట్టం వర్తిస్తుంది.ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో 10 నుండి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. బెయిల్ రావడం కూడా కష్టతరం అవుతుంది.
విద్యార్థులందరూ నిషేధిత మాదకద్రవ్యాలపై అవగాహన పెంచుకొని, వాటి వలలో పడకుండా, దేశాభివృద్ధికి తోడ్పడే పౌరులుగా ఎదగాలి అని తెలిపారు.