రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు తలుపునూరు విద్యార్థి ఎంపిక ==పదవ తరగతి చదువుతున్న విద్యార్థి పావని ==అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తు
అక్షర విజేత గోపాల్పేట ,రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని తలుపునురు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన విద్యార్థి పావని కబడ్డీ పోటీలలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు పావని నీ అభినందించారు. అదేవిధంగా చదువుతోపాటు ఆటపాటల్లో కూడా విద్యార్థులు ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు పేర్కొన్నారు.