వనపర్తి జిల్లాలో ఆ మండల కేంద్రంలో బాల్య వివాహం. ==రంగంలోకి దిగిన వనపర్తి బాలల పరిరక్షణ విభాగం అధికారులు, గోపాల్పేట పోలీసులు
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా ఎదుల మండలం కేంద్రంలోని ఓ బాల్యవివాహాన్ని బాలల పరిరక్షణ విభాగం వనపర్తి అధికారులు అలాగే గోపాల్పేట పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గోపాల్పేట పోలీసుల వివరాల ప్రకారం 31/10/2025 రోజు ఏదుల మండల కేంద్రంలో బాల్య వివాహం జరుగుతుందని చైల్డ్ లైన్ కు సమాచారం రావడంతో బాలల పరిరక్షణ విభాగం వనపర్తి అధికారులు అలాగే గోపాల్పేట పోలీసులు. ఏదుల మండల కేంద్రానికి వెళ్లి అట్టి బాల్య వివాహాన్ని అడ్డుకొని వారికి కౌన్సిలింగ్ చేసి ఇట్టి వివాహం చేయడానికి ప్రయత్నించిన పెళ్లి కొడుకు తల్లిదండ్రులపై అలాగే పెళ్లికూతురు తల్లిదండ్రులపై మొత్తం ఐదుగురుపై ఫిర్యాదురాలకు ముద్దం ఈదమ్మ బాలల పరిరక్షణ విభాగం అధికారి యొక్క ఫిర్యాదు మేరకు ఎఫ్ఆర్ఐ నమోదు చేయి చేయడమైనది. ఎఫ్ ఆర్ ఐ నమోదు చేసిన పోలీసు అధికారి జే రమణి ఏఎస్ఐ గోపాల్పేట్