తాగుడుకు బానిసై వ్యక్తి మృతి ==భార్య ఇస్లావత్ దేవి ఫిర్యాదు మేరకు ఎఫ్ ఆర్ ఐ నమోదు
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి:
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని పాటీగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ చంద్రు (49) అనే వ్యక్తి త్రాగుడుకు బానిసై మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గోపాల్పేట పోలీసుల వివరాల ప్రకారం 05/10/2025 రోజు 6 గంటల 30 నిమిషాల సమయంలో మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నందు చేర్పించారు. దీంతో చికిత్స పొందుతున్న ఆయన 10/11/2025 రోజు ఉదయం 10 గంటల 43 నిమిషాల సమయంలో చికిత్స కోలుకోలేక చనిపోయాడని మృతిని భార్య ఇస్లావత్ దేవి ఫిర్యాదు మేరకు ఎఫ్ ఆర్ ఐ నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతినీ శవాని కుటుంబ సభ్యులకు అప్పగించడం అయినదని పోలీసులు తెలిపారు