అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం తాడేపల్లిగూడెం
(అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో :
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద సీఐ బోణం అదిప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మార్వో సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి ఎమ్మార్వో సునీల్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతలను రక్షించడంలో, నేరస్తులను పట్టుకునే క్రమంలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. వారి త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరూ స్మరించుకో వాలన్నారు. సిఐ ఆది ప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని రోజుకొక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు
దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం మెగా రక్తదాన శిబిరాన్ని, సాయంత్రం పోలీస్ అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళులు అర్పించామన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ నాగరాజు, పెంటపాడు ఎస్ఐ స్వామి, ట్రాఫిక్ సోమరాజు పాల్గొన్నారు.