*మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కోట్ పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్*
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండల పరిధిలోని జిన్నారం గ్రామానికి చెందిన నర్సాపురం బిచ్చియ్య చనిపోవడం తో వారి కుటుంబ సభ్యులులకు బీఆర్ఎస్ పార్టీ కోట్ పల్లి మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్ 5వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా సుందర్ అనిల్ మాట్లాడుతూ, జిన్నారం గ్రామానికి చెందిన నర్సాపురం బుచ్చయ్య చనిపోవడం బాధాకరమని అన్నారు. బుచ్చయ్య ఆత్మకు శాంతి కలగాలని, భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు యు ప్రభాకర్,మండల్ జనరల్ సెక్రెటరీ హుస్సేన్, వీరేశం, ఫెరోజ్, అనిల్, శ్రీశైలం, నరేంద్రయ్య, బందయ్య, హాశం,రమేష్, శ్రీను,రాములు తదితరులు పాల్గొన్నారు.