*డిసిసి అధ్యక్ష పదవి అర్థ సుధాకర్ రెడ్డికే ఇవ్వాలి* *అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు* *వికారాబాద్ జిల్లా ఏర్పాటు కోసం కృ
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అర్థ సుధాకర్ రెడ్డికే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 16వ వార్డుకు చెందిన మున్నూరు శ్రీకాంత్ అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మున్నూరు శ్రీకాంత్ అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం కృషిచేసిన మహోన్నత వ్యక్తి అర్ధ సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విడవకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన నాయకుడని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీ మారని మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.వికారాబాద్ పట్టణంలో సుధాకర్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉందని అన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన అర్థ సుధాకర్ రెడ్డికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు అని అన్నారు. డిసిసి అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నిర్వహించే సత్తా ఉన్న నాయకుడు అర్థ సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే నాయకుడని, కాంగ్రెస్ కార్యకర్తకు కష్టం వస్తే అండగా ఉండే నాయకుడు అర్థ సుధాకర్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వికారాబాద్ జిల్లా ఏర్పాటు గురించి కృషిచేసిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎన్నో కేసులను తమ మీద వేసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నాయకుడని అన్నారు. అలాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 16వ వార్డుకు చెందిన మున్నూరు శ్రీకాంత్ అన్నారు.