బీసీల హక్కుల సాధనకు పోరాడాలి. జిల్లాలోని వివిధ మండలాల నూతన కమిటీల నియామకం వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు అధ్యక్షతన వనపర్తి జిల్లాకేంద్రంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించి వివిధ మండలాల కమిటీ నియామకం చేశారు. నూతన నియామకాల్లో భాగంగా బీసీ యువజన సంఘం నుంచి వనపర్తి మండల అధ్యక్షులుగా జె. చంద్రశేఖర్ మరియు బీసీ యువజన సంఘం గోపాల్ పేట మండల అధ్యక్షుడుగా ఎ. శివ మరియు పెబ్బేర్ మండల యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్. మహేందర్ ను నియమించినట్టు వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ముకుంద నాయుడు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు తమ పరిధిలోని బీసీలను ఏకధాటిపైకి తీసుకొచ్చి ఉద్యమించాలనీ, బీసీలు అందరూ తమ హక్కుల సాధనకు పోరాడాలనీ పేర్కొన్నారు. మండల పరిధిలోని బీసీల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో జరిగే భవిష్యత్ కార్యాచరణలో పాల్గొని బీసీల న్యాయపొరాటంలో యువకులు ముఖ్యపాత్ర వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు మరియు బీసీ సంఘం ఉపాధ్యక్షులు చిట్యాల రాములు, బీసీ సంక్షేమ సంఘం శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు జి. విరాట్, నూతనంగా ఎన్నికైన వనపర్తి మండల యువజన సంఘం అధ్యక్షులు జె. చంద్ర శేఖర్, గోపాల్ పేట మండల యువజన సంఘం అధ్యక్షుడు ఎ. శివ, పెబ్బేరు మండల యువజన సంఘం ప్రధానకార్యదర్శి ఎన్. మహేందర్ మరియు కోటేష్, ఆంజనేయులు, రాజు, గణేష్, యుగెంధర్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.