ఈనెల 31న ఏఐటీయూసీ 106 ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని పిలుపు.
అక్షర విజేత: ఆదిలాబాద్ జిల్లా బ్యూరో.
ఆదిలాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం భూక్తపూర్ లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశం కు ముఖ్యతిథిగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇంచార్జి యస్ విలాస్ పాల్గొన్నారు. అయన రాష్ట్ర రిపోర్టును ప్రవేశ పెట్టి మాట్లాడుతు, ఈ నెల 31న ఏఐటీయూసీ106 ఆవిర్భావ దినోత్సవన్ని, జిల్లా వ్యాపితంగా ఘనంగా జరుపుకోవాలని అలాగే ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా అనుబంధ సంఘాలు లో ఉన్న అన్ని మండలాల 2024-25 సంవత్సరాలకు సంబందించిన సభ్యత్వం వెంటనే చెల్లించుకొని, అన్ని మండలాల మహాసభల తేదిలు, నిర్ణయించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా మహాసభలు 2026 జనవరి 31న ఘనంగా జరుపుకొని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవాలంబిస్తున్న, వ్యతిరేక విధానాలను ఎండ కట్టడం కోసం కార్యాచరణ రూపొందించుకోని, పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అలాగే శ్రామిక బాట లు మండల కొటాలవారీగా పూర్తి చేసుకోవాలని 2026 రాష్ట్ర మహాసభలకు సిద్ధ కావాలని కార్మికులకు కార్మిక నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, డిప్యుటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, అఫ్రోజ్, గంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఉస్మాన్, రమణ, ఆశన్న, కాంతారావు, ఏ . ఐ.టి.యు.సి జిల్లా కోశాధికారి రాజన్న, ఖాసీం, మండల నాయకులు పాల్గొన్నారు.