ప్రభుత్వ స్థలం కబ్జా కి గురి..? లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలం పాలకులు స్వాహా ..? ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్న నాయకుడు ..? గత ప్రభుత
అక్షర విజేత పెద్దకడబూరు
ప్రభుత్వాలు మారిన భూ కబ్జాలు పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది . పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో సర్వే నెంబర్ 305 ప్రభుత్వ స్థలం పోరం పోగు ఉండడంతో భారత కమ్యూనిస్టు సిపిఎం పార్టీ కార్యకర్తలకు అలాగే ఇంటి స్థలాలు లేని నిరుపేద వెనుకబడిన గ్రామ ప్రజలకు 1992 లో మండలంలోనీ అందరూ కలిసికట్టుగా పోరాడినందుకు మండల మెజిస్ట్రేట్ ప్రభుత్వ కార్యాలయము నందు వారందరికీ ప్రభుత్వం నుంచి పట్టాలు మంజూరు చేయడం జరిగింది.ఈ సర్వే నెంబర్లు దాదాపు 20 మందికి పైగా నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండున్నర సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. అంతేకాకుండా అదే స్థలంలో 2 అంగన్వాడి సెంటర్లకు 10 సెంట్లు స్థలాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసినట్టు గ్రామనివాసులు తెలిపారు. అయితే కల్లుకుంట గ్రామంలో గత వైసిపి హాయంలో దాదాపు 10 సెంట్లు స్థలాన్ని ఓ నాయకుడు కాసులతో , అధికారులను లొంగదీసుకుని , గ్రామంలో నిరుపేద కుటుంబాలను, బెదిరించి కబ్జా చేసినట్టు గ్రామ నివాసుల మద్య గుసగుసలు వినిపించాయి.ఇదే సర్వే నెంబర్ లో గ్రామం మధ్యలో బస్టాండ్ ఉండడంతో ఇక్కడ సెంటు రూ 5 లక్షలు పైబడి పలుకుతుండడంతో గత అధికార పార్టీలోనీ ఓ నాయకుడు ఆ స్థలాన్ని కన్ను వేశాడు. అతను ఏకంగా స్థలాన్ని చదను చేసి లక్షలో ఇంటినే కట్టేశాడు అడ్డొచ్చిన కాలనీవాసులపై దాడి కూడా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తిత్వం చేశారు.పంచాయతీ తీర్మానం ,రెవెన్యూ అధికారులను రాజకీయ పలుకుబడి ఉండడంతో అనుమతులు తెచ్చుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ కథనం పూర్తి ఆధారాలతో విజేత పత్రికలు మరో శీర్షిక...లో