భారీ వర్షం వల్ల మండలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ==ప్రజల భద్రత, మా బాధ్యత రేవల్లి సబ్ ఇన్స్పెక్టర్ రజిత ==అత్యవసర పరిస్థితి ఎదురైతే 8712670615 నంబర్
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ రజిత రేవల్లి మండలం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అవసరం లేకపోతే బయటకు వెళ్ళవద్దు అలాగే విద్యుత్ తీగలు, చెట్లు, నీటి ప్రభసాల దగ్గరకు వెళ్లొద్దు. ఇండ్లలోనే సురక్షితంగా ఉండండి. దీంతోపాటు రైతులు తమ పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ఎవరికి ఎలాంటి ప్రమాదం గానీ అత్యవసర పరిస్థితి గానీ వెంటనే రేవల్లి పోలీస్ స్టేషన్ సంప్రదించండి. అలాగే 87126 70615 అనే నెంబర్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని. ప్రజల భద్రత మా బాధ్యత అని రేవల్లి సబ్ ఇన్స్పెక్టర్ రజిత తెలిపారు.