మొంతా తుఫాన్ హెచ్చరికలు కారణంగా ఆండ్ర జలాశయం పరిశీలన
అక్షర విజేత మెంటాడ:
మోంతా తుఫాన్ కారణంగా సోమవారం ఎంపీడీవో ఆండ్ర జలాశయ నీటిమట్టాన్ని పరిశీలించారు. తుఫాను క్రమక్రమంగా ఉధృతం కాబోతుందని అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో గాని ఉండకూడదని ప్రజలు పాడుబడిన ఇల్లు దగ్గర విద్య స్తంభాల పరిసరాల్లో గాని ఉండకూడదని, అవసరమైతే గాని బయట తిరగకూడదని ప్రజలను హెచ్చరించారు. ఈ నాలుగు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తెచ్చి పెట్టుకొని వృద్ధులను పిల్లలను బయటకు పంపరాదని అన్నారు