*మహిళా, శిశు సంక్షేమ శాఖ లో గ్రేడ్ 1 సూపర్వైజర్ గా శ్రీజని
అక్షరవిజేత మామడ:
ఇటీవల వెలువడిన టీఎస్పీఎస్సీ గ్రేడ్ వన్ ఫలితాలలో ఎంపికై మహిళా, శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ గా ఉద్యోగం సాధించింది శ్రీజని... మండలం లోని పొన్కల్ గ్రామానికి చెందిన చింతకుంట లక్ష్మీ శేఖర్ దంపతుల కుమార్తె అయిన శ్రీజనీ చిన్నతనం నుండి పట్టుదలతో చదువుతూ చదువులో ముందంజలో ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆడపిల్ల చదువు ఆదర్శం అనిపించింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత కలిగిన ఉద్యోగం సాధించిన శ్రీజనీ నీ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. కలలు కని సాకారం చేసుకోవడం అనేది శ్రీజని నిరూపించిన ఉదాహరణ.ఇటీవల మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న శ్రీజని సోమవారం రోజున భైంసా పట్టణం లో ని కార్యాలయం లో మహిళా, శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ 1 సూపర్వైజర్ గా కొలువుదీరింది.