కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
అక్షరవిజేత,ఖమ్మం :
కార్తీక పౌర్ణమి (నవంబర్ 5) సందర్భంగా ఖమ్మం జిల్లాలోని భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.ఈ సూపర్ లగ్జరీ బస్సులో మొత్తం 36 పుష్బ్యాక్ సీట్లు ఉంటాయి.బస్సు ఖమ్మం బస్ స్టేషన్ నుండి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి, నవంబర్ 4వ తేదీ ఉదయం కానిపాక వినాయక స్వామి దర్శనం, గోల్డెన్ టెంపుల్ (వెల్లూరు) దర్శనం అనంతరం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దర్శనం కల్పించబడుతుందని తెలిపారు.
టికెట్ ధర పెద్దలకు రూ. 5000, పిల్లలకు రూ. 2530గా నిర్ణయించారు.
వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు:
???? 91364 46666
???? 99592 25979
???? 99592 25965.
---