చేగుంటలో పోలీసుల కాటన్ సర్చ్
అక్షరవిజేత,మాసాయిపేట :
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం తూప్రాన్ డిఎస్పి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజల్లో కలిసి పనిచేసేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా చేగుంట బస్టాండ్ వీధులు మరియు ఎన్జీవోస్ కాలనీలో ఉదయం కాటన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా వీధుల్లో ఇండ్లలో ఎవరెవరు ఉన్నారని వారి వినియోగిస్తున్న వాహనాలు వివరాలు తెలుసుకున్నారు. సరైన పత్రాలు చూపించని 69 ద్విచక్ర వాహనాలతో పాటు రెండు ఆటో లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల మమేకమై పోలీస్ శాఖ పనిచేయాలని ఉద్దేశంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు చేగుంట పట్టణంలో వివిధ పరిశ్రమలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు నివాసం ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు రహస్యంగా ఉంచుతున్నారని అనుమానంతో ఉన్న ఇళ్లలో తనిఖీలు చేశామని కొత్త వ్యక్తులను అద్దెకు వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ రామాయంపేట సిఐలు రంగాకృష్ణ వెంకటరాజా గౌడ్ మరియు ఎస్ఐలు చైతన్య కుమార్ రెడ్డి, నారాయణ,శివ నరసింహులు, నరేష్, సృజన,లింగం తో పాటు డివిజన్ పరిధిలో 110 పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు