నేవీ ఆయుధ డిపో కోసం, నిర్బంధాలు, ర్యాలీ ధర్నాలను నిషేధించడం కూటమి ప్రభుత్వానికి సరికాదు - సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ రామ్మోహన్ డి
అక్షర విజేత / బుట్టాయగూడెం :
జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో ఆయుధ డిపో నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని, ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు, ప్రజాస్వామ్య యుత కార్యక్రమాలను , 30 యాక్ట్ పేరుతో నిషేధించడం సరికాదని సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ రామ్మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 12 వందల ఎకరాలను డ్రోన్ సర్వే ద్వారా సేకరించారని వారు అన్నారు. ఆదివాసి గిరిజన రైతుల భూములను తీసుకొని నేవి ఆయుధ డిపో నిర్మాణం చేస్తే ఆదివాసీ గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు . ఇప్పటికే భూమి ఉండి కూడా సరైన జీవన. స్థితిగతులు మెరుగుపరచలేకపోతున్నారు. ఉన్నా భూమిని ఆయుధ కర్మగారానికి ఇచ్చేస్తే ఆదివాసి గిరిజన ప్రజల జీవితమే ఆగమ్య గోచరముగా మారుతుందని రామ్మోహన్ ధ్వజమెత్తారు. వంక వారి గూడెం పంచాయతీ ప్రజలు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అని, పంచాయితీలో నుండి పాదయాత్రగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం ఇవ్వాలని, కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పోలీసు ద్వారా నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, గృహ నిర్బంధం చేయడం, పాదయాత్రను అడ్డుకొని జరగనివ్వకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలకు మాట్లాడే హక్కును హరించడమే అవుతుందని. రామ్మోహన్ ఆరోపించారు. ఏజెన్సీ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే పిసా, పంచాయితీ గ్రామసభ తీర్మానాలు తప్పనిసరి గా ఉండాలని కానీ నేవీ ఆయుధ డిపో నిర్మాణం విషయంలో ప్రభుత్వం యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఏవి కూడా పరిగాణం లోకి తీసుకోకుండా పంచాయితీలో అన్ని గ్రామాలలో సర్వే ప్రారంభించారని, దానికి నిరసనగా నేవీ ఆయుధ డిపో వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ ప్రజా సంఘాలు శాంతియుతంగా ప్రజాస్వామ్య యుతంగా ర్యాలీ నిర్వహిస్తా ఉంటే పోలీసు ర్యాలీని అడ్డుకోవడం బాధాకరమని రామ్మోహన్ అన్నారు. ఆదివాసి గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ చర్యలు సరికాదని రామ్మోహన్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వంక వారిగూడెంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని రద్దు చేయాలని, ఆదివాసి గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసి ప్రాంతంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు.పర్యావరణాన్ని కాపాడాలని, ఆదివాసి చట్టాలు మరియు హక్కుల రక్షణ కొరకు చర్యలు తీసుకోవాలని రామోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.