బి సి బాలుర హాస్టల్ ను సందర్శించిన యు ఎస్ ఎఫ్ ఐ
బి సి బాలుర హాస్టల్ ను సందర్శించిన యు ఎస్ ఎఫ్ ఐ
– సిద్దిపేట జిల్లా కార్యదర్శి గుడికందుల రవి
అక్షరవిజేత,సిద్దిపేట
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల గ్రామంలో ఉన్న బిసి బాలుర ప్రి మేట్రిక్ హాస్టల్ ను యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.విద్యార్థులతో యు ఎస్ ఎఫ్ ఐ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారు.సంక్షేమ హాస్టల్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించాలి,పెండింగ్ లో ఉన్న కాస్మొటిక్ చార్జెస్ విడుదల చేయాలి అని అన్నారు.వార్డెన్ లు విద్యార్థుల రక్షకులు, వారి ఎదుగుదల ఎలా ఉందో గమనించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి గుడికందుల రవి, జిల్లా నాయకులు హేమంత్, మణికంఠ, నవీన్ పాల్గొన్నారు.