ఎరుపెక్కని ఎర్రజెండా.! మసక బారిన గుడిసెల పోరాటం.. గుడిసెల పోరాటంలో తప్పు ఎవరిది..?
ఎరుపెక్కని ఎర్రజెండా.!
మసక బారిన గుడిసెల పోరాటం..
గుడిసెల పోరాటంలో తప్పు ఎవరిది..?
ఏళ్లు గడుస్తున్న పరిష్కరణ చూపని పోరాటం.
గుడిసెకు పెట్టిన ఖర్చు బూడిద పాలు.
నష్టపోయిన నిరుపేదలు.
హామీలకే పరిమితమైన ఎమ్మెల్యేలు మంత్రులు
అక్షరవిజేత,వనపర్తి ప్రతినిధి :
కాయ కష్టం చేసి నిరుపేదలు పైసా పైసా కూడబెట్టి దుబాయ్ కుంటలో ఏర్పాటు చేసుకున్న గుడిసెల పోరాటం బూడిద పాలు అయ్యేనా.. నిరుపేదలు పూట గడవని పరిస్థితిలో ఉన్న నివాసం ఉండటానికి ఉచితంగా ప్రభుత్వ స్థలం వస్తాదని ఆశతో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని అమరచింత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్న. ఏళ్లు గడుస్తున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరుపేదల ఆవేదన వర్ణతీరం అమరచింత కమ్యూనిస్టు పార్టీ ఘనమైన చరిత్ర కు సాక్ష్యం అలాంటి ఎర్రజెండా ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఫలితం దక్కకపోవడంతో నిరుపేద ప్రజలను వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రజల పక్షాన నిలబడే శక్తిగా కమ్యూనిస్టులు అంటే సమాజంలో ఎనలేని గౌరవం.. వారి పోరాటాలపై సమాజంలో అపార నమ్మకం. సంపాదన పదవులు కులమత రాజకీయాలకు దూరంగా. ప్రజల శ్రేయస్ కోసం ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా పోరాటాలు కొనసాగించారు. అమరచింత నిరుపేద వాడవాడలో గుడిసెల పోరాటంలో రెపరెపలాడిన ఎర్రజెండా అలాంటి పోరాటంలో గత సంవత్సరాలుగా నిరుపేదలకు న్యాయం జరగకపోవడంతో ప్రజల్లో విమర్శలకు దారి తీస్తుంది నిజాయితీగా ప్రజల తరఫున పోరాడే కామ్రేడ్లు కరువయ్యారా.. పార్టీ సిద్ధాంతాలు విధానాల వ్యక్తిగత అవసరాలు స్వ ప్రయోజనాల కోసం అని వినిపిస్తుంది. నిరుపేదలకు పూర్తి భరోసా లభించడం లేదు..నిరుపేదలకు నిజమైన కమ్యూనిస్టులతోనే సరైన న్యాయం లభిస్తుంది అన్న వాదన వినిపిస్తుంది ఇప్పటికైనా గత ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ గుడిసెలు పోరాట సమస్యను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు