విద్యుత్ ఘాతానికి గురై పాడి గేదే మృతి.*
*విద్యుత్ ఘాతానికి గురై పాడి గేదే మృతి.*
*20 రోజుల క్రితమే కొన్న గేదె మృతి చెందడంతో లబోదిబోమంటున్న రైతు.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
విద్యుత్ ప్రమాదంలో పాడి గేదె మృతి చెందడంతో రైతు లబోదిబోమన్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నజ్దిక్ సింగారం గ్రామానికి చెందిన పాడి రైతు పుణ్యమూర్తి రాములుకు చెందిన గేదె సోమవారం ఉదయం విద్యుత్ షాక్ గురై చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు చేసేటప్పుడు మట్టి పోయడం వల్ల ట్రాన్స్ఫార్మర్ దిమ్మ ఎత్తు తగ్గడం వల్ల ప్రమాదం జరిగింది. 20 రోజుల క్రితమే 1లక్ష 20 వేల రూపాయలతో కొనుగోలు చేశానని మరో 15 రోజులలో దూడకి జన్మనిచ్చేదని రైతు తెలిపారు. నజ్దిక్ సింగారం నుండి మీర్ఖాన్ పేట్ వెళ్లేదారిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు ఎటువంటి కంచె లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పశువుల స్థానంలో మనుషులు ఉంటే ఎవరు బాధ్యులని, ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్లకు కంచలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.