శెట్టి అన్నపూర్ణమ్మ మృతి - మాజీ ఎంపీ నామ సంతాపం
అక్షరవిజేత,ఖమ్మం :
చింతకాని మండలం, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు శెట్టి మోహన్ రావు సతీమణి శెట్టి అన్నపూర్ణ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఇట్టి విషయం తెలిసిన బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. అన్నపూర్ణమ్మ మృతి వారి కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నామ పేర్కొన్నారు.