సార్సాల రోడ్ల సౌందర్యం చూడండి
అక్షర విజేత కాగజ్ నగర్ ప్రతినిధి
కాగజ్ నగర్ మండలం సార్సాలలోని రోడ్లన్నీ బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. విద్యార్ధులు పాఠశాలలకు వెల్లాలన్నా.. గ్రామస్థులు ఊరికి వెల్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.