నేడు జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి--- ----సి ఐ టీ యూ జిల్లా సహాయ కార్యదర్శి. పెరుమాల్లపల్లి మోహన్ రావు.
అక్షర విజేత ఖమ్మం:
నేడు దేశవ్యప్త జరిగే సార్వత్రిక సమ్మెలో ,కార్మికులు కూలీలు.రైతులు, అసంఘటిత వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయవలసిందిగా సి ఐ టీ యూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళ పల్లి మోహన్ రావు ఒక ప్రకటనలో తెలియ చేశారు.మోడీ గత సంవత్సరాల పాలనలో స్వదేశీ,విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్ధిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ చట్టాలను తీసుకువచ్చారు.8 గంటల పనిదినాలను 12 గంటలు పెంచి పని భారం పెంచేందుకు శ్రీకారం చుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చట్టభద్ధ ఆదేశాలను న్యాయ స్థానాల తీర్పులను బుట్టధాకలు చేస్తున్నారని వారు విమర్శించారు.