కూలి పనికి వెళ్లి బురదలో కుప్పకూలి ఊపిరాడిక మృతి
అక్షరవిజేత,కామారెడ్డి ప్రతినిధి :
మంగళవారం రోజున ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో గెంట్యల బసవయ్య తండ్రి పేరు రాజయ్య , వయసు 41 సంవత్సరాలు, పద్మశాలి , కూలి పని, బోర్లo క్యాంపు గ్రామం బాన్సువాడ మండలం ప్రతిరోజు మాదిరిగానే కూలి పనులకు వెళ్లి వ్యవసాయ పొలంలో ఒడ్డు వరాలు చేస్తుండగా ప్రమాదవశాత్తున్న కాలుజారి పొలంలో పడిపోయి ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక చనిపోయినాడు. మృతుని భార్య గంగమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.