ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన జైన ఆహ్లాదిని
అక్షరవిజేత,చిగురుమామిడి :
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన జైన భాను కృష్ణ కూతురు జైన ఆహ్లాదిని పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు 12000 రూపాయల విలువ గల నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ టై బెల్టు లు వారి తాత జైన ఆంజనేయులు ఉచితంగా అందజేశారు .ఈ సందర్భంగా స్కూల్ టీచర్లు జైన ఆంజనేయులు శాలువాతో సత్కరించి అభినందించారు.ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉన్నపటికీ తన స్వాగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశ్యంతో తన కూతురు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు.ఇలాంటి సామాజిక కార్యక్రమాల ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు సంఖ్య పెరుగుతుదన్నారు ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ,ఉపాధ్యాయులు, గ్రామ యువకులు విద్యార్థులు పాల్గొన్నారు