నారాయణ పురం గ్రామంలో చిన్నారుల వినూత్న నిరసన
అక్షరవిజేత,కేసముద్రం :
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చిన్నారుల వినూత్న నిరసనకు దిగారు. మా గ్రామానికి పట్టాలివ్వాలని రిలే నిరాహార దీక్షలో కూర్చున్న చిన్నారులు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నారాయణపురం గ్రామంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం నాటికి ఆరు రోజులకు చేరింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ఫలితం మాత్రం శూన్యంగా ఉందని, పాలకులు రైతులకు పట్టాలు ఇస్తామని హామీలు ఇవ్వడం తప్ప పనిలో మాత్రం ఫలితం లేకపోయిందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేక మా గ్రామంలోని రైతులకు, రైతు భరోసా ఇతర ప్రభుత్వ పథకాలు అందడం లేదని, తక్షణమే పాలకులు స్పందించి, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడి మా గ్రామ రైతులకు ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో చిన్నారులతో పాటు మాజీ ఎంపిటిసి ధరావత్ రవి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఉపేందర్, యాదగిరి,రమేష్, లక్పతి, మల్లయ్య, రవి, దేవేందర్, హరిలాల్, అనిల్, అనిత, రాణి, స్వప్న, పద్మ, తదితరులు కూర్చున్నారు.