ఆర్మీ సైనికుడికి అండగా నిలిచిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
అక్షరవిజేత,అదిలాబాద్ ప్రతినిధి :
కొమురం భీం జిల్లా జైనూర్ మండలం జామ్ని గ్రామ వాస్తవ్యుడు క్రెందే ఈశ్వర్ బట్టల షాపు ఇటీవలే జరిగిన అల్లర్లలో ప్రమాదవశాత్తు జైనూర్ లో ఉన్న 2అంతస్థుల బట్టల షాపు పూర్తిగా కాలిపోయి సుమారు కోటి రూపాయల ఆస్థి నష్టం జరిగింది దీని పై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ శుక్రవారం రోజు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కలిసి తనకు జరిగిన నష్టం గురించి వివరాలు చెప్పిన ఆర్మీ సైనికుడు క్రెందే ఈశ్వర్ ఈ విషయం పై ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంకి సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చి మీకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చేస్తానని సైనికునికి ఎమ్మెల్యే భరోసాన్నిచ్చారు