రెబ్బెన గంగాపూర్ రైల్వే ట్రాక్ మూసివేతతో ప్రజల అవస్థలు...
అక్షరవిజేత,అదిలాబాద్ ప్రతినిధి :
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ రైల్వే ట్రాక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు నంబాలకు చెందిన వ్యక్తి ఆరోగ్యం బాగోలేక 108 అంబులెన్స్ గ్రామానికి రాలేకపోవడంతో బంధువులు అతి కష్టం మీద రైల్వే ట్రాక్ గేటు దాటించారు ప్రజల అవస్థలను గమనించి రైల్వే అధికారులు త్వరగా సమస్యను పరిష్కరించాలని శుక్రవారం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు