సమస్యల పరిష్కారం కోసం జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌ను కలిసిన బీజేపీ నేత ఏనుగుల తిరుపతి*
అక్షరవిజేత, హైదరాబాద్ బ్యూరో:
ఓల్డ్ బోయినిపల్లి డివిజన్లోని మానస సరోవర్ హైట్స్ కాలనీ సమస్యల పరిష్కారం కోసం కాలనీ సెక్రటరీ మకరంద్ , బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, రమేష్, వరుణ్ తదితరులు కలిసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ తరఫున వినతిపత్రాన్ని కమిషనర్ కి అందజేశారు. కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ అవాంతరాలు, రోడ్ల దుస్థితి, స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడం, వీధి కుక్కల బెడద, డంపింగ్ యార్డ్ సమస్యలపై స్పష్టమైన నివేదికను సమర్పించారు. వినతిపత్రం అందుకున్న వెంటనే అపూర్వ చౌహాన్ స్పందించి సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కాలనీవాసులు మరియు బీజేపీ నాయకులు జోనల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, అధికారుల సమర్థ సమన్వయంతో త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.