ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా షేకాపూర్ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి లోకండే గంగాధర్
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని షేకాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లోకండే గంగాధర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యలపై పోరాడుతానని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసినందుకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.