*సమస్యలతో సతమతం అవుతున్న సికెఎం హాస్పిటల్* *స్త్రీ శిశు సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం* *ఏ ఐ ఎఫ్ డీ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల రాగ
వరంగల్ జిల్లా, నవంబర్ 28 ( అక్షర విజేత) ప్రతినిధి:
పేద మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించిన సికేఎం ఆసుపత్రిలో సమస్యలు తాండవిస్తున్నాయని, సౌకర్యాల లేమితో, గర్భిణీ స్త్రీలు నానా అవస్థలు పడుతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ( ఏ ఐ ఎఫ్ డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ, జిల్లా కార్యదర్శి కనకం సంధ్య అన్నారు. శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య (ఏ ఐ ఎఫ్ డీ) బృందం సి కె ఎం ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు, బాలింతలు దగ్గరికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ, జిల్లా కార్యదర్శి కనకంసంధ్య మాట్లాడుతూ....
సి కె ఎం ఆస్పత్రి 60 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయినప్పటికీ, సదుపాయాలు,వసతులలో మెరుగైన నిర్వహణ లేదని రోజుకు 300 నుంచి 400 మంది ఓపి పేషన్స్ వస్తున్నారని అలాగే 20 నుంచి 30 డెలివరీలు జరుగుతున్నాయని కానీ సిబ్బంది కొరత సేవల స్థాయి తగ్గిపోవడంతో రోగుల సంరక్షణ ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సికేఎం ఆస్పత్రిలో సుమారు 26% పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఫలితంగా గర్భిణీలు వైద్య పరీక్షలు ల్యాబ్ టెస్టులు, స్కానింగ్ కోసం ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోవడంతో వారు ప్రైవేటు డయాగ్నస్టిక్స్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని పెంచుతుందని అన్నారు. అంతే కాదు సికేఎం ఆస్పత్రిలో రోగుల నుండి సిబ్బంది డబ్బులు బాగా వసూలు చేస్తున్నారని డెలివరీ అయిన పేషెంట్ ని బెడ్ మీదకి షిఫ్ట్ చేయాలంటే 500 రూపాయలు, పాప లేక బాబుని శుభ్రం చేయాలంటే 1000 రూపాయల చొప్పున అడుగడు గున డబ్బులు వసూలు చేస్తున్నారని పేషంట్స్ పేరెంట్స్ చెబుతున్నారని అన్నారు. ఆసుపత్రిలో ఈ ఆర్థిక దోపిడీని అరికట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సికేఎం ఆసుపత్రి పైన దృష్టి పెట్టాలని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు రేడియాలజీ,,ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు,శానిటేషన్ పని వర్కర్లను వెంటనే భర్తీ చేయాలని ఆసుపత్రిలో వసతి లోపాలు తీర్చేందుకు తగిన నిధులు కేటాయించాలని, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తున్న పేద మధ్యతరగతి గర్భిణీల కుటుంబాల కోసం ఉచిత లేదా తక్కువ చార్జీల సేవల పథకం అమల్లోకి తేవాలని, ఆస్పత్రి నిర్వహణలో పేషంట్- ఫస్ట్ విధానం, పారదర్శకత బాధ్యత వహించే ప్రమాణాలను అమలు చేయాలని, ఒక సమగ్ర సమీక్ష, పైలెట్ కమిటీ నియమించి ఆసుపత్రులను వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైక్య(ఏ ఐ ఆఫ్ డి డబ్ల్యూ) గా డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య జిల్లా కమిటీ సభ్యురాలు ఈక.యమున, పెండ్యాల. లలిత, బెల్లంపల్లి. భారతి, పల్లెపు. మంజుల, జక్కుల జక్కుల కోమల. కోమల తదితరులు పాల్గొన్నారు.