*ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 135 వ వర్ధంతి* *పూలమాల వేసి నివాళ్ళుఅర్పించిన* *రాజేంద్రనగర్ ఎమ్మార్పిఎస్ నాయకులు.పోతురాజు యాదయ్య*
*అక్షర విజేత రాజేంద్రనగర్*
రాజేంద్రనగర్ సర్కిల్ ప్రభుత్వ కళాశాల వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే
135 వ వర్ధంతిని పురస్కరించుకొని మహాత్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సర్కిల్ ఎమ్మార్పీఎస్ నేతలు.ఈ సందర్బంగా జాతీయ నాయకులు వనం నర్సింహా మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు క్యాసారం శంకర్రావు మాదిగ,ఏంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతురాజు యాదయ్య మాదిగ, మాట్లాడుతూ.
మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త సామాజిక అంశాలపై తన కలంతో గులాంగిరి రాసి మహాయుద్ధమే నడిపిన మహాత్ముడు సత్యా శోధక సమాజం ద్వారా తన సర్వస్వం సమాజ అభ్యున్నతికి దార పోసిన యుగపురుషుడు త్యాగశీలి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
మానవాళి చేత మహాత్ముడని పిలుచుకున్న మహానీయుడు పాఠశాలలో బందిగా ఉన్న అక్షరాన్ని అందరికీ అందించిన మహోన్నతుడు మహిళా హక్కులు కూడా మానవ హక్కులేనని నినాదించి తన పోరాటంలో భార్యను భాగ స్వామ్యం చేసి సమాజం కోసమే పని చేసిన సమానత్వపు యోధుడని అన్నారు.ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ మహాత్మ ఆశయాల కోసం కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో
జిల్లా నాయకులు నాన్నగారి రాంచేందర్ మాదిగ, జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎడ్లకాడి సూర్యం,నవజ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షులు మంగళవారం
శ్రీనివాస్,సీనియర్ నాయకులు డా.వి. శ్రీరాములు, జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు పలుగుచెరువు మహేష్,వి.నవీన్ పోయిల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.