*ర్యాష్ డ్రైవింగ్ కారణంగా దూడ బలి*
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-*
కొమురం భీమ్ కాగజ్ నగర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని కారు వేగంగా దూసుకెళ్లి రోడ్డుపై ఉన్న దూడను ఢీకొట్టింది ఈ ఘటనలో దూడ అక్కడికక్కడే మృతి చెందింది ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కారుతో సహా పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు డ్రైవర్ను గుర్తించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు