లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గోపాల్పేట్ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ==40 వేల రూపాయల డిమాండ్ ముందు 20,000 తీసుకుంటుండగా..!! ==రెడ్ హ్యాండెడ
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలోని ఓ అవినీతి చేప ఏసిపి అధికారులకు చిక్కిన ఘటన మంగళవారం 2 గంటలకు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం మండల కేంద్రంలో విద్యుత్ అసిస్టెంట్‌గా ఇంజనీరింగ్ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి ఏదుల మండల కేంద్రానికి చెందిన ఓ రైతు దగ్గర ట్రాన్స్ఫారం మంజూరు కోసం 40 వేల రూపాయలు డిమాండ్ చేస్తూ 20వేల రూపాయలు ముందు ఇవ్వాలి. తర్వాత ట్రాన్స్ఫారం వచ్చిన తర్వాత మరో 20 వేలు ఇవ్వాలి అని ఒప్పందంలో భాగంగా మంగళవారం 2 గంటలకు 20వేల రూపాయలు రైతు నుండి డబ్బులు తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసిబి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అతనిని రేపు నాంపల్లి కోర్టులో హాజరు పరచున్నట్లు మహబూబ్‌నగర్ ఏసీబీ డిఎస్పిసిహెచ్ బాలకృష్ణ తెలిపారు.