*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి*
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పరిధిలోని తాడిపర్తి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్న నిర్వాహకులు, అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు లోడే రఘు,సింగల్ విండో సీఈవో రామ్మోహన్, సిబ్బంది, గోపాల్పేట టౌన్ అధ్యక్షుడు శివన్న, లోకా రెడ్డి,వెంకటయ్య, పిట్టల రవికుమార్, గోవర్ధన్ రెడ్డి, ధీరమల్లు,రామకృష్ణ, బంగారయ్య, వంశీకృష్ణ, కర్ణాకర్ ,చరణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.