అమెజాన్ కు ఎంపికైన దీపక్ సాయి
తాడేపల్లిగూడెం (అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: తాడేపల్లిగూడెం శశి ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ఏఐఎంఎల్ విభాగానికి చెందిన నంబుల దీపక్ సాయి అమెజాన్ సంస్థలు ఉద్యోగ సాధించారు. ఏడాదికి 33.75 లక్షల ప్యాకేజీ తో ఉద్యోగం సాధించిన దీపక్ సాయిని శశి సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మహమ్మద్ ఇస్మాయిల్ అభినందించారు. విద్యార్థుల్లో ప్రతివారం వికలాంపజేసి నిర్వహించే స్థాయి సంస్థల్లో అవకాశాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు శిక్షణ అందించడంలో శశి కళాశాల ఇప్పుడు ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. దీపక్ సాయి సాధించిన విజయం తో విద్యార్థులకు మరింత ప్రేరణ కల్పిస్తుందని నరేంద్ర కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా దీపక్ సాయి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.