బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్ 23.50 లీటర్లు మద్యం స్వాధీనం అక్రమంగా మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవు ఎస్సై దామోదర్
అక్షర విజేత గజ్వేల్ :
గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ దామోదర్ తెలిపారు శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పలు గ్రామాల బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 23.50 లీటర్ల అక్రమ మధ్యాన్ని స్వాధీనం చేసుకుని మద్యం విక్రయిస్తున్న పలువురిపైన కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరూ కూడా బెల్ట్ షాపులు నడపవద్దని గ్రామాల్లో చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మేవారిని వదిలిపెట్టమని అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.