చిలకలూరిపేట నారాయణ స్కూల్లో బాలల దినోత్సవం
అక్షర విజేత చిలకలూరిపేట
చిలకలూరిపేట నారాయణ స్కూల్లో బాలల దినోత్సవం ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల మొత్తం పండగ వాతావరణంలో ఆనందంగా కళకళలాడింది.
కార్యక్రమానికి ప్రిన్సిపాల్ కె. శేషగిరి రావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అవినాష్ , వైస్ ప్రిన్సిపాల్ నాగవర్ధని , ఈ క్యాంపస్ జెడ్. సి ఓ గౌసియా . అలాగే ఎ జి యం లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను అభినందించారు.
బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటలు, స్కిట్లు, గేమ్స్ మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిన్నారులు తమ ప్రతిభను ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రిన్సిపాల్ కె. శేషగిరి రావు మాట్లాడుతూ, "పిల్లలు దేశ భవిష్యత్తు, పిల్లలలో సృజనాత్మకత, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం" అని పేర్కొన్నారు.
కార్యక్రమం ఆనందంగా, విజయవంతంగా ముగిసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.