గోపాల్పేట మండల కేంద్రంలో ఆటోను ఢీకొట్టిన బైక్ ==ఆటో డ్రైవర్, ఓ మహిళ కు తీవ్ర గాయాలు,
అక్షర విజేత గోపాల్పేట్ ,రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందు గల ప్రధాన రహదారిలో ఆటోను బైకు ఢీ కొట్టిన ఘటన బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు గోపాల్పేట మండల కేంద్రం నుండి ఏదుట్ల గ్రామానికి వెళుతున్న ఆటోను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందు బలంగా బైక్ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కి ఆటోలో కూర్చున్న మరో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం దీంతో స్థానికులు అంబులెన్స్ కు అలాగే దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటో డ్రైవర్, ఆ మహిళని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది