ఖద్దరు చొక్కా... ప్రభుత్వ భూమి కబ్జా. అక్రమ వెంచర్ దోచేస్తున్నారు మింగేస్తున్నారు. ఫిర్యాదు చేసిన పట్టించుకోని కమిషనర్. కాసులకు కక్కుర్తి పడ్డ క
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
పేరుకే పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ వెంచర్లు పేరుతో భారీగా దోచుకో తింటున్న ఖద్దరు చొక్కా ఊరుకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తున్న ఖద్దర్ చొక్కాలు
వనపర్తి జిల్లా అమరచింత కొత్తగా మండలం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. అనంతరం మున్సిపాలిటీగా ఏర్పాటు అయింది. ప్రభుత్వ భవన నిర్మాణాలకు మండలం లో ప్రభుత్వ భూములు లేవని సాకుతో ఇప్పటికే మంజూరైనా నిర్మించడం లేదు.కానీ ప్రభుత్వం 10% ల్యాండ్ ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్న వారి పై మున్సిపల్ అధికారులలో నిఘా కరువైందని చర్చ సాగుతోంది. డీటీసీపీ నుంచి లే అవుట్ పర్మిషన్లు తీసుకోకుండానే అక్రమ వెంచర్ వెలిసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
*10 శాతం ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం.*
అమరచింత పట్టణంలో సర్వే 580. 581 నెంబర్లు లోని ప్రభుత్వ, భూము అన్యాక్రాంతం అవుతున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లలో ప్రభుత్వానికి రావాల్సిన 10 శాతం ల్యాండ్ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం మైనట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వ్యవసాయ వ్యవసాయేతర భూములలో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేయాలంటే గ్రామపంచాయతీ నుండి నాలా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.కాని గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోకుండానే ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు ప్రజల మధ్య చర్చ సాగుతోంది.అక్రమ సంపాదనకు అలవాటు పడిన అక్రమార్కులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.ప్రభుత్వ నిబంధనలు పాటించకుండానే వెంచర్ లో ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. వ్యవసాయ భూములను ప్లాట్ల మాదిరిగా మార్చి అమ్మకాలు చేపట్టి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అటువంటి భూములకు రైతు భరోసా నిధులు కూడా జమ అవుతుండడంతో కొనుగోలుదారులు కూడా వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
*కమిషనర్ తీరు మారడం లేదా..?*
అమరచింత మున్సిపల్ కమిషనర్ తీరు మారడం లేదా? 580 581 భూమిపై ఫిర్యాదులు అందిన అమరచింత కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వానికి రావాల్సిన 10 శాతం భూమి కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ సర్వే నెంబర్ పై ఎంపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఆ సర్వే నెంబర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది.
లేదా కమిషనర్ కు ముడుపు ఎందుకున్నారని ప్రచారం కూడా జోరుగా ఉంది.
*గ్రామ పంచాయతీ పర్మిషన్ ల తోనే ప్లాట్లు ఏర్పాటు..*
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి నాలా పర్మిషన్ తీసుకొని వెంచర్ ఏర్పాటు చేయాలి.కానీ అటువంటి నిబంధనలు పట్టణం లో పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొత్తగా వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ అనుమతి పొందాలి.ఆ వెంచర్ లో గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని కేటాయించాల్సి ఉంటుంది.పర్మిషన్ తీసుకోకపోవడంతో అప్పనంగా అక్రమార్కులు ఆ భూమిని మింగేస్తున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి లక్షలు గడిస్తున్నారు.ప్రభుత్వ, 10 శాతం భూములలో ప్లాట్లు ఏర్పాటు చేసి అమాయకులకు వాటిని అమ్మి లక్షలలో వెనకేసుకుంటున్నారు. ఇటువంటి వెంచర్ల పై అధికారులు చూసి చూడని ధోరణి అవలంబిస్తున్నారని చర్చ సాగుతోంది.