నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం గత నెల రోజులుగా పనిచేయని మోటార్ బోర్
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మూడవ వార్డులో గత నెలరోజుల నుండి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. గత నెల రోజుల క్రితం మోటార్ బోరు రిపేర్ అయిందని ఇప్పటివరకు బాగు చేయించలేదని తెలిపారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. నీళ్లు లేక పక్క కాలనీ నుండి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోటార్ బోరు రిపేరు చేయించి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.