*పది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ..*
*అక్షర విజేత, చందుర్తి :*
ప్రధాని మోదీ కానుకగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న ఉచిత సైకిళ్లను జోగాపూర్, బండపెల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20 వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మోదీ కిట్ పేరుతో సహాయాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పదివ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసమే ఎంపి బండి సంజయ్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు ఎక్కువ శాతం విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పని చేసి జీవనాన్ని కొనసాగించేవారే ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారు తమ పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని, విద్యార్థుల పరీక్ష ఫీజు ఆ మొత్తాన్ని తన వేతనం నుండి చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి బండి సంజయ్ కుమార్ కు రిటర్న్‌గిఫ్ట్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, చందుర్తి బిజెపి మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, పొంచెట్టి రాకేష్, పెరుక గంగరాజు, బోరుగాయ తిరుపతి, అయోధ్య పర్శరాములు, మనోహర్ రెడ్డి, లక్ష్మణ్, మోత్కుపల్లి రాజశేఖర్, నాయకులు పత్తిపాక శ్రీనివాస్, రాజు బందెల వెంకటేష్, చిర్రం తిరుపతి, కుసుంబ లింగారావు, మేకల జలంధర్, ఉపాద్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.