అనుమతులు లేకుండానే మట్టి తరలింపు...! జేపీ దర్గా పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టి టిప్పర్లు పట్టించుకోని అధికార యంత్రం...? ఆదివారం దర్గాకు వచ
అక్షర విజేత షాద్నగర్..
రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో ప్రసిద్ధి చెందిన హజ్రత్ సయ్యద్ జహంగీర్ పీర్ దర్గా నుంచి భారీ టిప్పర్లు ఇసుక, మొరం, కంకర తరలిస్తుంటారు. ప్రధానంగా దర్గాను సందర్శించేందుకు భక్తులు మొక్కలను తీర్చుకునేందుకు శుక్ర, ఆదివారాలలో ఎక్కువ వస్తూ ఉంటారు. వేల సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ ప్రధానంగా ఆ రహదారి మీదుగానే భారీ సంఖ్యలో టిప్పర్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. టిప్పర్ల డ్రైవరు అజగ్రత్తగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా జేపీ దర్గా నుంచి కొత్తూరు నందిగామ మండలలలో ఇన్ముల్ నర్వ, మేకగుడా, రంగాపూర్ గ్రామ సమీపంలో టిప్పర్లు ఢీకొని ఎందరో మృత్యువాత, అంగవైకల్యంగా మారిపోయిన సంఘటనలు ఉన్నాయి. టిప్పర్ల డ్రైవర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణ నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.