బొప్పూడి గ్రామం వద్ద పేకాట దందా పట్టివేత..*
బొప్పూడి అక్షర విజేత
చిలకలూరిపేట రూరల్ పోలీసులు బొప్పూడి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి (NH-16) సమీపంలో పేకాట (కోత ముక్క) ఆట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ముట్టడించి పట్టుకున్నారు.ఈ కార్యక్రమాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ జి. అనీల్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు నిర్వహించారు.పోలీస్ సిబ్బంది సహకారంతో చేసిన దాడిలో, పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 17,550 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.